శనివారం, 1 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 మార్చి 2025 (15:21 IST)

Snake: మహా కుంభమేళాలో భారీ సర్పం.. మహిళ ఏం చేసిందంటే? (video)

Snake
Snake
జనవరి 13న ప్రారంభమైన కుంభమేళ.. ఫిబ్రవరి 26 మహా శివరాత్రితో ముగిసింది. 144 ఏళ్ల తర్వాత ఏర్పడిన కుంభమేళ కావడంతో భక్తులు సైతం పుణ్యస్నానాలు ఆచరించేందుకు భారీగా ఆసక్తి చూపించారు. ప్రతి రోజు కుంభమేళలో కోట్లాది మంది పుణ్యస్నానాలు ఆచరించారు. 
 
యోగి సర్కారు సైతం కుంభమేళకు వచ్చే భక్తులకు ఏ మాత్రం ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. తాజాగా ఒక మహిళ పుణ్యస్నానం ఆచరిస్తుండగా.. ఒక భారీ సర్పం ఆమె వద్దకు వచ్చింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ సర్పాన్ని చూసిన సదరు మహిళ ఏ మాత్రం భయపడలేదు. 
 
తనను ఆశీర్వాదం ఇవ్వడానికి నాగరాజు వచ్చాడని ఆనంద పడింది. పాముకు దండం పెట్టింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు అది.. ఏదో రీల్స్ స్టంట్ అని కూడా కొట్టిపారేస్తున్నారు.