మగపామును చంపితే.. ఆడపాము తరుముకుంది.. కాపలాకు నలుగురు
ఉత్తరప్రదేశ్‌లో 24 ఏళ్ల యువకుడు ఓ పాముకు భయపడి అదీ ఆడ పాముకు భయపడి... నలుగురిని కాపలా పెట్టుకున్నాడు. ఆ ఆడపాము పగబట్టిందని.. దాని కాటుకు భయపడి సెక్యూరిటీని తన వెంటనే పెట్టుకుని తిరుగుతున్నాడు. తాను గ
ఉత్తరప్రదేశ్‌లో 24 ఏళ్ల యువకుడు ఓ పాముకు భయపడి అదీ ఆడ పాముకు భయపడి... నలుగురిని కాపలా పెట్టుకున్నాడు. ఆ ఆడపాము పగబట్టిందని.. దాని కాటుకు భయపడి సెక్యూరిటీని తన వెంటనే పెట్టుకుని తిరుగుతున్నాడు. తాను గత ఏడాది ఓ మగ పామును చంపానని, అప్పటి నుంచి ఓ ఆడ పాము తనపై పగబట్టి చంపాలని చూస్తోందని చెప్తున్నాడు.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో ఓ యువకుడు తనకు రక్షణగా నలుగురు సెక్యూరిటీ గార్డులను పెట్టుకున్నాడు. ఆ యువకుడు ఎక్కడకెళ్లినా ఆ నలుగురు గార్డులు కాపలా కాస్తుంటారు. మగపామును చంపి వెళ్తున్నప్పుడు ఆడపాము కొన్ని కిలోమీటర్ల మేర తరుముకుందని.. ఆపై ఎన్నోసార్లు తనపై కాటేసేందుకు ప్రయత్నించిందని తెలిపాడు.
ఆ పామంటేనే భయపడిపోతున్న ఆ యువకుడు దానిని చంపినవారికి రూ.5000 రివార్డు కూడా ఇస్తానని ప్రకటించాడు. ఆ యువకుడి తీరుపై ఆ జిల్లా అధికారులు స్పందించారు. వర్షాకాలం కావడంతో పాముల సంచారం సహజమంటున్నారు. ఆ యువకుడిపై పాము దాడి చేయాలని చూస్తోందనే విషయంలో నిజంలేదంటున్నారు.