ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 జూన్ 2022 (15:50 IST)

సోనియా గాంధీకి అస్వస్థత - గంగారామ్‌లో ఆస్పత్రిలో అడ్మిట్

sonia
కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉన్నట్టుండి అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆమెను ఆదివారం ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు. 
 
కాగా, సోనియా గాంధీకి ఈ నెల 2వ తేదీ కరోనా వైరస్ పాజిటివ్ అని తేలిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి ఆమె హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతూ వచ్చారు. ఈ క్రమంలో ఆమె అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆమె ఆస్పత్రిలో చేరగా, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. 
 
ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, అందువల్ల ఆమె ఆస్పత్రిలోనే ఉంటారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా వెల్లడించారు. కాగా, ఆమెతో పాటు ఆయన తనయుడు రాహుల్ గాంధీలు నేషనల్ హెరా్డ్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరుకావాల్సివుంది.