సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 ఏప్రియల్ 2023 (12:06 IST)

చెన్నైలో ఏటీఏంలా ఎనీ టైమ్ మందు మిషిన్లు (video)

తమిళనాడులో ఏటీఏంలా ఎనీ టైమ్ మందు మిషిన్లు వచ్చేసాయి. ఏటీఎంలో కార్డు పెట్టి కావాల్సిన మొత్తాన్ని కొడితే క్యాష్ వచ్చినట్లే.. ఏ లిక్కర్ కావాలో దానికి సరిపడా డబ్బులు వేస్తే ఈ ఏటీఎం నుంచి నచ్చిన మందు వచ్చేస్తుంది. ప్రస్తుతం తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ ఏనీటైమ్ మందు మిషన్ ఏర్పాటు చేశారు. 
 
చెన్నైలోని కోయంబేడులోని ఓ షాపింగ్ మాల్‌లో టాస్మాక్ శనివారం ఆటోమేటిక్ లిక్కర్ వెండింగ్ మెషీన్‌ను ప్రారంభించింది. ఈ మెషీన్ ఏటీఎం మెషీన్‌లా పని చేస్తుంది. 
 
అలాగే, వినియోగదారులు టచ్ స్క్రీన్ ద్వారా తమకు కావాల్సిన మద్యం రకాన్ని ఎంచుకుని, క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా చెల్లించవచ్చు. ఆల్కహాల్ ఆటోమేటిక్‌గా బయటకు వచ్చేలా దీన్ని రూపొందించారు.