మహిళా కళాకారిణితో నృత్యం చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన ఉపాధ్యాయుడు (video)
ఈమధ్య కాలంలో గుండెపోటు(heart attack)తో మరణిస్తున్నవారి సంఖ్య ఎక్కువవుతోంది. చిన్నాపెద్దా అనే తేడాలేకుండా గుండెపోటుతో హఠణ్మరణం చెందుతున్నారు. తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ జిల్లా కిష్ణగఢ్-రెన్వాల్ ప్రాంతంలో జరిగింది. పూర్తి వివరాలను చూస్తే.. మంగల్ జఖర్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఇటీవలే పదవీ విరమణ చేసారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు వేడుక చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనితో ఆయన సోదరుడు మన్నారామ్ జఖర్ కుటుంబం కూడా జోధ్ పూర్ నుంచి వచ్చింది.
ఆదివారం రాత్రి కుటుంబం అంతా కలిసి వేడుకుల్లో మునిగిపోయారు. స్టేజి పైన నృత్య కళాకారిణి నాట్యం చేస్తుండగా మన్నారామ్ ఆమెతో కలిసి డాన్స్ వేస్తున్నాడు. అలా నాట్యం చేస్తూ చేస్తూ హఠాత్తుగా స్టేజిపైనే కుప్పకూలిపోయాడు. ఆయన అలా పడిపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు అతడికి గుండెపోటు వచ్చిందని గమనించి సీపీఆర్ చేసారు. అయినా అతడిలో ఎలాంటి కదలిక కనిపించలేదు. దీనితో సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు.