ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

#Ranthambore ఆడపులి కోసం రెండు మగ పులుల భీకర పోరాటం, వీడియో వైరల్

రెండు పులులు తలపడ్డాయి. ఈ రెండు పులుల మధ్య భీకర పోరాటం జరిగింది. అదీ కూడా ఒళ్లుగగుర్పొడిచేలా. ఈ రెండు పులుల పోరాటాన్ని కొద్దిసేపు చూసిన మరో పులి... అక్కడ నుంచి మెల్లగా జారుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, దాన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 
 
ఇండియన్ ఫారిస్ సర్వీస్ అధికారి పర్వీన్ కాస్వాన్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదే రెండు పులులు యద్ధానికి దిగిన వీడియో. దాదాపు 200 కేజీల చొప్పున బరువున్న ఈ రెండు భీకరంగా పోరాడాయి. మరో పులి పక్కనే నిలబడి దీన్నంతటినీ గమనించింది. కానీ పోరు తారాస్థాయికి చేరగానే ఆ పులి పొదల్లోకి పారిపోయింది. 
 
'రెండు పులుల మధ్య పోరాటం ఇలాగే ఉంటుంది, భీకరంగా.. ఒళ్లుగగుర్పొడిచేలా! తమ ఇతర జంతువులు వస్తే పులులు ఇలాగే స్పందిస్తాయి. ప్రాణాలకు తెగించి పోరాడుతాయి' అని పర్వీన్ ట్వీట్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా అదే స్థాయిలో స్పందిస్తున్నారు. 
 
'ఇది అత్యంత అరుదైన వీడియో' అని ఓకరంటే.. 'ప్రకృతి అంటే అంతే.. అక్కడి పోరాటాలు ఇలాగే ఉంటాయి' అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు. అయితే, భీకర పోరులో ఏ ఒక్క పులికి గాయాలు కాలేదని పర్వీన్ వెల్లడించారు.