గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 11 జులై 2020 (20:14 IST)

చైనాతో పోరాడిన సైన్యం హైదరాబాద్‌కు?.. ఎందుకో తెలుసా?

గల్వాన్‌ లోయలో చైనా సైన్యంతో పోరాడిన బీహార్ రెజిమెంట్‌ 16వ బెటాలియన్‌ హైదరాబాద్‌కు వస్తున్నట్టు తెలిసింది. ఈ బెటాలియన్‌లోని సైనికులు తూర్పు లద్దాఖ్‌లో మార్చి-ఏప్రిల్‌ కాలంలో తమ రెండున్నరేళ్ల విధులను పూర్తి చేసింది.

నిజానికి ఈ కాలం ముగిసిన తర్వాత పీస్‌ లొకేషన్‌కు సైనికులు వెళ్లాల్సి ఉంది. కానీ కరోనా లాక్‌డౌన్‌తో జాప్యం జరిగింది. ఇప్పుడీ బెటాలియన్‌ హైదరాబాద్‌కు వస్తోందని సమాచారం. అయితే దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి వుంది.