గురువారం, 23 మార్చి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated: శుక్రవారం, 20 జనవరి 2023 (16:04 IST)

ఒకేసారి ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య.. అసలేం జరిగింది?

suicide
ఒకేసారి ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య పాల్పడిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... తమకూరు జిల్లా బరకనహాల్ తండాకు చెందిన రంజిత, బిందు, చందనలు అక్కాచెల్లెళ్లు.. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయారు. అమ్మమ్మ దగ్గరే పెరిగారు. పెద్దవాళ్లిద్దరూ గార్మెంట్ లో పనిచేస్తున్నారు. చందన మాత్రం చదువుకుంటుంది. 
 
ఇటీవల అమ్మమ్మ మరణించడంతో ముగ్గురూ కుంగిపోయారు. అంతేగాకుండా  21 రోజులైనా ఇంటి నుంచి బయటికి రాలేదు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సాయంతో పోలీసులు ఇంటి పై కప్పు నుంచి చూడగా.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉరేసుకుని ఆత్మహత్యకు  పాల్పడినట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.