సరిహద్దుల్లోకి రెండు పాకిస్థాన్ డ్రోన్లు.. బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు
పాకిస్థాన్ సరిహద్దుల వద్ద కయ్యానికి కాలు దువ్వుతోంది. బీఎస్ఎఫ్ జమ్మూ-కాశ్మీర్‌లోని రణబీర్ సింగ్ పురా సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద బుధవారం రాత్రి గుర్తు తెలియని డ్రోన్ కదలికలను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గుర్తించింది. వెంటనే అప్రత్తమై కాల్పులు జరుపడంతో తిరిగి వెళ్లిపోయిందని సైన్యం తెలిపింది. ఆర్‌ఎస్‌పురా సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద బుధవారం రాత్రి డ్రోన్ కదలికలను గుర్తించినట్లు బీఎస్‌ఎఫ్ ఒక ప్రకటలో తెలిపింది.
అంతర్జాతీయ సరిహద్దు, తీర నియంత్రణ రేఖ వద్ద డ్రోన్లు కనిపించడం మొదటి సంఘటన కాదని, గత నెల 21న మెన్దార్ సెక్టార్‌లోనూ కదలికలను గుర్తించినట్లు తెలిపారు. సెప్టెంబరు నెలలో అంతర్జాతీయ సరిహద్దుల్లోని సాంబా సెక్టార్‌లోనూ రెండు డ్రోన్లు తిరుగుతుండగా బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించి కాల్పులు జరిపామని సైన్యం తెలిపింది. సరిహద్దుల్లో పాకిస్థాన్ నుంచి డ్రోన్లు సంచరిస్తుండడంతో బీఎస్ఎఫ్ బలగాలు అప్రమత్తమయ్యాయి.