మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 డిశెంబరు 2020 (13:01 IST)

చిన్న కోడలితో మామ రంకుబాగోతం ... కళ్లార చూసిన అత్త ఏం చేసిందంటే...

తన ఇంటి చిన్న కోడలిలో ఓ మామ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం పెద్ద కోడలితో పాటు.. అత్తకు కూడా తెలిసింది. మామ - చిన్న కోడలు రంకుబాగోతం పెద్ద కోడలుతో పాటు.. అత్తకు ఏమాత్రం నచ్చలేదు. పైగా, ఓ రోజున పడక గదిలో కోడలితో మామ రసపట్టులో ఉండగా, అత్త కంటపడ్డారు. అంతే.. పెద్ద కోడలుతో చేతులు కలిపిన అత్త.. అక్రమ సంబంధం పెట్టుకున్న కట్టుకున్న తన భర్తను కత్తితో గొంతుకోసి చంపేసింది. వారి చేతుల నుంచి తప్పించుకున్న చిన్నకోడలు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన ఘోరం చెప్పింది. ఈ దారుణం ఉత్తరప్రదేశఅ రాష్ట్రంలోని భాదోయి జిల్లా కోయిరానా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కోయిరానా గ్రామానికి చెందిన 55 ఏళ్ల వ‌య‌సున్న ఓ వ్య‌క్తికి భార్య‌, న‌లుగురు కుమారులు ఉన్నారు. ఈ న‌లుగురు కుమారులు ఉపాధి కోసం ముంబైకు వలస వెళ్లారు. వీరిలో ఇద్దరికి వివాహమైంది. దీంతో ఆ ఇద్దరు కోడళ్లు అత్తమామల వద్దే ఉంటున్నారు. 
 
ఈ క్ర‌మంలో చిన్న కోడలితో మామ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఓ రోజున వీరిద్దరూ పడక గదిలో మంచి రసపట్టులో ఉండగా, అత్తతో పాటు.. పెద్ద కోడలి కంటపడ్డారు. అప్పటి నుంచి వారిద్దరిపై అత్త, పెద్ద కోడులు గుర్రుగా ఉండసాగారు. ఈ క్రమంలో చిన్న కోడ‌లిని కొద్ది రోజుల క్రితం పుట్టింటికి పంపారు. కోడ‌లిని ఆమె ఇంటికి పంప‌డంతో కోపంతో రగిలిపోయిన మామ‌.. పెద్ద కోడ‌లి మీద దాడి చేసి కళ్ళకు గాయం చేశాడు. 
 
దీంతో నాలుగు రోజుల క్రితం చిన్న కోడ‌లిని మామ ఇంటికి తీసుకువ‌చ్చాడు. చేసేదేమీ లేక శ‌నివారం రాత్రి మామ‌పై అత్త‌, పెద్ద కోడ‌లు క‌లిసి క‌త్తితో గొంతు కోసి చంపేశారు. అప్ర‌మ‌త్త‌మైన చిన్న కోడ‌లు అక్క‌డి నుంచి తప్పించుకుని వెళ్ళి స్థానిక పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఘ‌టాన‌స్థ‌లికి చేరుకున్న పోలీసులు.. అత‌న్ని ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే మృతి చెందిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.