శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 జూన్ 2022 (12:31 IST)

ప్రధాని మోదీ-కెమెరా.. ప్రకాష్ రాజ్ సెటైర్ ట్వీట్ (video)

PM modi
ప్రధాని మోదీ-కెమెరా అనే అంశంపై ప్రస్తుతం నెట్టింట విమర్శలు, సెటైర్లు పెరిగిపోతున్నాయి. తాజాగా మోదీ ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తూ విమర్శల వర్షం కురిపిస్తుంటారు. తాజా వీడియో ఒకటి మోదీపై మరోసారి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టేలా చేసింది. 
 
యోగా దినోత్సవంలో భాగంగా కర్ణాటక వెళ్లిన నరేంద్రమోదీని ఒక వ్యక్తి స్వాగతిస్తున్న సందర్భంలో రికార్డు చేసిన వీడియో అది. ఈ వీడియోను ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ "కెమెరా సమీపంలోకి వస్తే చాలు.. మన సుప్రీం హీరో/దర్శకుడిని ఎవరూ బీట్ చేయలేరు" అంటూ సెటైర్ విసిరారు. తన ట్వీట్లలో ఎప్పుడూ కనిపించే "జస్ట్ ఆస్కింగ్" అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు.