మైనర్ అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం.. ఇద్దరూ విషం తాగారు.. చివరికి?

gang rape
gang rape
సెల్వి| Last Updated: బుధవారం, 9 సెప్టెంబరు 2020 (11:32 IST)
దేశంలో కరోనా విజృంభిస్తున్నా... కామాంధుల్లో మార్పు రాలేదు. దేశంలో అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో ఇప్పుడిప్పుడే జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా నుంచి దూరంగా వుండేందుకు జనాలు నానా తంటాలు పడుతున్నారు. కానీ కామాంధులు మాత్రం మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్నారు. ప్రాణాంతక వ్యాధులు వస్తున్నా.. వారిలో మార్పు రావట్లేదు. కఠినమైన చట్టాలు వచ్చినా ఫలితం శూన్యం.

తాజాగా పశ్చిమ బెంగాల్‌లో దారుణం జరిగింది. ఇద్దరు మైనర్ అక్కాచెల్లెళ్లపై ఐదుగురు యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 4న జల్పాయిగురి జిల్లాలో ఈ దారుణం జరిగింది.

16, 14 ఏళ్ల అక్కాచెల్లెళ్లపై ఐదుగురు యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు. దీంతో అవమాన భారంతో ఇద్దరూ ఇంటికి వచ్చి విషం తాగారు. ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఐదుగురు నిందితుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.దీనిపై మరింత చదవండి :