శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Updated : సోమవారం, 20 మార్చి 2017 (21:23 IST)

ఏంటిది? 48 గంటల్లో 72,000 మంది, మోదీని యోగి మించిపోతారా?

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ పేరు ఇప్పుడు భారతదేశంలో మారుమోగుతోంది. ఆయనలా పీఠాన్ని అధిష్టించారో లేదో కాబోయే ప్రధానమంత్రి అంటూ ఆయనకు ట్యాగు లైన్లు కూడా వచ్చేశాయి. మరోవైప

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ పేరు ఇప్పుడు భారతదేశంలో మారుమోగుతోంది. ఆయనలా పీఠాన్ని అధిష్టించారో లేదో కాబోయే ప్రధానమంత్రి అంటూ ఆయనకు ట్యాగు లైన్లు కూడా వచ్చేశాయి. మరోవైపు ఆయనకు దేశవ్యాప్తంగా మద్దతుదారులు గణనీయంగా పెరుగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకోవైపు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఆయన ఫాలోవర్స్ విపరీతంగా పెరిగిపోతున్నారు. 
 
ట్విట్టర్ విషయానికే వస్తే ఆయనకు శనివారంనాటి... అంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించకముందు వున్న ఫాలోవర్లు లక్షా 47వేల మంది. ఐతే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన 48 గంటల్లోనే ఈ సంఖ్య ఒక్కసారిగా 2 లక్షలా 19 వేలకు చేరుకుంది. ఇప్పుడా సంఖ్య కాస్తా 2.34 లక్షలకు చేరుకుంది. రెండు రోజుల్లోనే ఆయనను ఫాలో అవుతున్నవారి సంఖ్య 72 వేలకు పెరిగింది. 
 
పరిస్థితి చూస్తుంటే త్వరలోనే మోదీ ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్యను దాటుతారేమోనన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలావుంటే యోగి ఆదిత్యనాథ్ కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సన్నిహిత వర్గం యోగి సర్కారుపై ఓ కన్నేసి వుంచనున్నట్లు సమాచారం.