సోమవారం, 25 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By మనీల
Last Updated : శనివారం, 5 అక్టోబరు 2019 (16:17 IST)

ఘుమఘుమలాడే బొమ్మిడాయిల పులుసు తయారు చేసే విధానం.

కావలసిన పదార్థాలు:
 
బొమ్మిడాయి ముక్కలు - ఐదు
 
నూనె - ఐదు టేబుల్‌‌స్పూన్లు
 
ఉల్లిపాయలు - రెండు
 
పచ్చిమిర్చి - నాలుగు
 
కరివేపాకు - కట్ట
 
టొమాటోలు - మూడు
 
పసుపు - టేబుల్‌‌స్పూన్
 
కారం - టేబుల్‌‌స్పూన్
 
ధనియాల పొడి - టేబుల్‌‌స్పూన్
 
ఉప్పు - రుచికి తగినంత
 
చింతపండు - ఒకకప్పు
 
తయారీ విధానం:
ఒక పాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, మెంతులు వేయాలి. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని చేసి గోధుమ రంగులోకి మారే వరకు వేగించాలి. తర్వాత కరివేపాకు, పచ్చి మిర్చి వేసి కలపాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు వేయాలి. పసుపు, కారం వేసి బాగా కలియబెట్టాలి. తర్వాత ఉప్పు, ధనియాల పొడి వేయాలి. చింతపండు రసం పోసి బాగా కలపాలి. మిశ్రమం కాస్త ఉడుకుతున్న సమయంలో బొమ్మిడాయి ముక్కలను వేయాలి. చిన్నమంటపై పది నిమిషాల పాటు ఉడికించుకుంటే, వేడి వేడి బొమ్మిడాయిల పులుసు రెడీ.