నాగుల చవితి.. వేపచెట్టు, రావిచెట్టు కింద వుండే దేవతలను పూజిస్తే?
నాగుల చవితి అక్టోబర్ 28 శుక్రవారం ఉదయం 10.33 గంటల తర్వాత ప్రారంభమై.. అక్టోబర్ 29, 2022న ఉదయం 08.13 నిమిషాలకు ముగుస్తుంది. అయితే శుక్రవారం పూట నాగుల చవితి పూజ చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి.. శుచిగా స్నానమాచరించి.. పుట్ట వద్దకు వెళ్లాలి. పుట్ట పక్కన ఓ దొప్పను వుంచి అందులో పాలు పోయాలి. గుడ్డును కూడా వుంచవచ్చు.
కార్తీకంలో వచ్చే ఈ చవితి శివకేశవులతో పాటు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మంచిది. చలిమిడి, చిమిలితో నాగేంద్రులను తయారుచేసి అతికించి పాలు పోసి పూజ చేయాలి. ఈ మాసంలోని శుద్ధ చవితి నాడు సర్పరూప సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి.
సంతానం కోసం ప్రార్థన చేయాలంటే సుబ్రహ్మణ్య స్వామిని వేడుకోవాలి. కుజ, రాహు దోషాలు వున్నవారు కార్తీకంలో షష్ఠీ, చతుర్దశిలో ఉపవాసం వుండి నాగపూజ చేయాలి. వేపచెట్టు, రావిచెట్టు కింద వుండే నాగ దేవతలను పూజించడం చేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.