ఆదివారం, 5 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 నవంబరు 2023 (20:12 IST)

రాశిని మార్చుకున్న రాహు-కేతువు... వీరికి కష్టావు తప్పవట..

rahu kalam
నవగ్రహాలలో రాహువు, కేతువు ఇద్దరూ అననుకూల గ్రహాలు. వారు ఎప్పుడూ తిరోగమన ప్రయాణంలో ఉంటారు. నీడ గ్రహాలుగా అర్థం చేసుకోగల రాహువు-కేతువులను చూస్తే అందరికీ భయమేస్తుంది. శని ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారాలంటే నెమ్మదిగా కదులుతాడు. 
 
కానీ రాహు-కేతువులు ఒక రాశి నుండి మరొక రాశికి మారడానికి 18 నెలలు పడుతుంది. నవగ్రహాలలో రాహు కేతువుల సంచారం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. వారిద్దరూ గత అక్టోబర్ 30న తమ రాశిని మార్చుకున్నారు. 
 
ఇది మొత్తం 12 రాశులను ప్రభావితం చేసినప్పటికీ, కొన్ని రాశుల వారు ఈ రాహు కేతువుల స్థానమార్పుతో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. వాళ్లెవరో తెలుసుకుందాం.. 
 
సింహరాశి 
రాహు కేతువులు స్థానమార్పుతో కొంత ఇబ్బందిని కలిగించబోతున్నారు. ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో సమస్యలు వచ్చినా సంయమనం పాటించడం మంచిది. మీ మాటల్లో స్పష్టంగా ఉండండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు గొడవలకు దూరంగా ఉండటం మంచిది. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి.
 
ధనుస్సు
రాహు కేతువులు మీకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కొత్త వెంచర్లు మంచి ఫలితాలను ఇవ్వవు. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. డబ్బు లావాదేవీల విషయంలో అప్రమత్తత అవసరం. ముఖ్యమైన విషయాల్లో ఆలోచించి చర్యలు తీసుకోవడం మంచిది. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త చాలా అవసరం.
 
మేషరాశి
రాహువు- కేతువుల సంచారం వలన మీరు సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ధన ప్రవాహం ఉన్నప్పటికీ ఖర్చులు పెరుగుతాయి. సమస్యలను తెచ్చి పెట్టే బంధువులకు దూరంగా ఉండటం మంచిది. శత్రువుల వల్ల సమస్యలు కొనసాగే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. కొత్త పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.