Webdunia - Bharat's app for daily news and videos

Install App

శనివారం కాకులకు అన్నం పెట్టి.. పేదలకు వస్త్రదానం చేస్తే? (video)

Written By సెల్వి
Updated: శనివారం, 12 సెప్టెంబరు 2020 (13:44 IST)
శనివారం పూట నువ్వుల నూనెను రాసుకుని అభ్యంగన స్నానమాచరించి.. చిన్నపాటి వస్త్రంలో నువ్వులుంచి మూటలా కట్టుకుని.. నువ్వులనూనెతో శనీశ్వరునికి దీపం వెలిగించాలి. నిష్ఠతో శని కవచం లేకుంటే శని గాయత్రి జపం చేయాలి.
 
నైవేద్యం చేసిన తర్వాత కాకికి నువ్వులు కలిపిన అన్నం పెట్టి.. ఆపై భోజనం చేయాలి. ఇలా చేస్తే ఏలినాటి శని, జన్మ శని, అర్ధాష్టమ, అష్టమ శని దోషాలు తొలిగిపోతాయి. ఇంకా శనీశ్వరుని అనుగ్రహంతో శుభఫలితాలు ఏర్పడతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.
 
అలాగే శనిభగవానుడి శాంతి కోసం నవగ్రహ హోమాలు చేయించడం.. నువ్వులను శుభ్రం చేసి.. వేయించి ఏలకులు పొడి చేరి దంచుకుని తిలచూర్ణం చేసి శ్రీ వేంకటేశ్వరునికి, శనీశ్వరుడికి నైవేద్యంగా సమర్పించి పేదలకు దానం చేస్తే శని దోషాలుండవు. ఈతిబాధలు తొలగిపోతాయి. ఇంకా ఒక్కో శనివారం ఉపవాసముండి.. కాకి అన్నం పెట్టి పేదలకు వస్త్రాలు, అన్నదానం చేస్తే శనిభగవానుడి అనుగ్రహం లభిస్తుంది. 
 
శనీశ్వరుడి అనుగ్రహం కోసం.. శనిదోషాలు తొలగిపోవాలంటే శనివారం పూట శివాలయంలోని శనీశ్వరుని చుట్టూ నువ్వులతో దీపం వెలిగించి ప్రదక్షణలు చేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

 

అన్నీ చూడండి

కొత్త కారు కొన్న ఆనందంలో పూజకు వచ్చిన కుటుంబంలో పెను విషాదం

అంబటి రాంబాబు గుండెకి రెండు స్టెంట్లు, ఆసుపత్రి ఐసీయూలో వుంచి చికిత్స

స్థానిక సంస్థల ఎన్నికల కోసం జనసేన కసరత్తు.. క్లీన్ స్వీప్‌కు రంగం సిద్ధం

దూరం 60 కిలోమీటర్లు.. బిల్లు రూ.5662 - ఓలా బిల్లు చూసి విస్తుపోయిన ప్రయాణికులు

9వ తరగతి బాలికను గర్భవతిని చేసిన ప్రైవేట్ ట్యూటర్... ఎక్కడ?

అన్నీ చూడండి

29-08-2026 శనివారం ఫలితాలు - కష్టించినా ఫలితం ఉండదు.. ఖర్చులు విపరీతం...

28-08-2026 రాశి ఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు.. ధనలాభం వుంది..

సోదరునికి రాఖీ కడుతున్నారా? ఈ శ్లోకం చెబుతూ కట్టండి, టైమింగ్స్ ఏంటి?

రాఖీ పౌర్ణమి రోజున మూడు యోగాలు.. మేషరాశికి పట్టిందల్లా బంగారమే

శబరిమల ఆలయంలో బంగారం మాయం.. ప్రశాంత్‌కు మెదడులో రక్తస్రావం

తర్వాతి కథనం
Show comments