శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (13:15 IST)

శుక్రవారం.. పూజగదిలో స్టైన్‌లెస్ స్టీల్ దీపాలను..? (video)

Lamp
మన ఇంట్లోని పూజగదిలో శుక్రవారం పూట కొన్ని పనులు చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. శుక్రవారం, అమావాస్య, పౌర్ణమి, జన్మ నక్షత్రం రోజున తలంటుస్నానం చేయకూడదు. మహిళలు గుమ్మడి కాయ, కొబ్బరి కాయను పగుల కొట్టకూడదు. 
 
ముఖ్యంగా గర్భిణీ మహిళలు కొబ్బరికాయను కొట్టడం చేయకూడదు. శుక్రవారం పూట తప్పకుండా ప్రధాన ద్వారానికి పసుపు కుంకుమలతో అలంకరించడం మరిచిపోకూడదు. తద్వారా దుష్ట శక్తులు ఇంట్లోకి చొరబడవు. శుక్రవారం దీపం వెలిగించేటప్పుడు ఎవ్వరూ నిద్రపోకూడదు. పూజగది వాడిపోయిన పుష్పాలను వుంచకూడదు. 
 
శుక్రవారం పూట వెన్నను కరిగించడం చేయకూడదు. శుక్ర, మంగళవారాలు లక్ష్మీకి ప్రీతికరమైన రోజులు కావడంతో.. వెన్న లక్ష్మీప్రదం అందుకే వెన్నను కరిగించడం ఆ రెండు రోజుల్లో చేయకూడదు. వెన్నలో మహాలక్ష్మీ దేవి కొలువై వుంటుందని విశ్వాసం. తమలపాకు, వక్కను మాత్రమే పూజ సమయంలో ఉపయోగించాలి. ప్యాకెట్లలో అమ్మే వక్కపొడిని పూజకు ఉపయోగించకూడదు.
 
తమలపాకులు రెండు, నాలుగు, ఆరు, ఎనిమిదిగా సరి సంఖ్యలో వుండాలి. వక్క 2, 4 సంఖ్యలో వుండేలా వుంచాలి. దేవుని ముఖాలు తెలియని విధంగా పుష్పాలను అలంకరించకూడదు. పాదాలను కప్పివుంచేలా మాత్రం పువ్వులతో శుక్రవారం అలంకరణ చేయాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. శుక్రవారం పూట ఉదయం 4 గంటల నుంచి ఆరు గంటల్లోపు దీపం వెలిగించాలి. 
 
సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల్లోపు దీపం వెలిగించడం చేయాలి. స్టైన్‌లెస్ స్టీల్ దీపాలను పూజగదిలో ఎట్టిపరిస్థితుల్లో ఉపయోగించకూడదు. వెండి లేదా ఇత్తడి దీపాలను ఉపయోగించాలి. అలాకాకుంటే ప్రమిదలను వాడటం ఉత్తమ ఫలితాలను ఇస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.