బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 సెప్టెంబరు 2020 (10:56 IST)

ఐదు గురువారాలు ఇలా చేస్తే ఇక కోటీశ్వరులే... (video)

లక్ష్మీ పంచమి రోజున లేదా గురువారం రోజున కుబేర పూజ చేసేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. లక్ష్మీ పంచమి లేదా గురువారం పూట శ్రీలక్ష్మిని పూజించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఈతిబాధలు, రుణబాధలు తొలగిపోతాయి. ప్రతి గురువారం సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కుబేర సమయంగా పేర్కొంటారు. 
 
ఈ సమయంలో ఈతిబాధలు, రుణబాధలు తొలగించుకోవాలనుకునేవారు.. వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొనే వారు ఐదు గురువారాల్లో సాయంత్రం ఐదు గంటల నుంచి 8 గంటల వరకు కుబేర దీపాన్ని వెలిగించి.. శ్రీ లక్ష్మీ కుబేర నామాన్ని స్తుతించి పూజించడం ద్వారా రుణబాధల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే లక్ష్మీ పంచమి రోజున కూడా ఇలా చేస్తే.. కుబేర పూజ చేయడం ద్వారా సర్వ మంగళం చేకూరుతుంది.
 
కుబేర పూజ ఎలా చేయాలంటే?
తొలుత ఇంటి ముందు శుభ్రం చేసుకుని రంగవల్లికలతో తీర్చి దిద్దుకోవాలి. పూజ గదిలో కుబేర ముగ్గును వేయాలి. తర్వాత లక్ష్మీ దేవికి చందనం, పంచామృతంతో అభిషేకం చేయించాలి. అభిషేకం ముగిసిన తర్వాత స్వీట్లను నైవేద్యంగా సమర్పించి దీపారాధన చేయాలి. పూజా సమయంలో శ్రీ సూక్తం, లక్ష్మీ అష్టకం పఠించాలి. ఇలా చేయడం ద్వారా ధనధాన్యాలు, సిరిసంపదలు చేకూరుతాయని.. కోటీశ్వరులు అవుతారని పండితులు చెప్తున్నారు.