నవగ్రహాలు- నవధాన్యాలు.. ప్రాముఖ్యత ఏమిటి?

Selvi| Last Updated: గురువారం, 18 డిశెంబరు 2014 (13:31 IST)
నవగ్రహాలు- నవధాన్యాలు.. ప్రాముఖ్యత ఏమిటనేది తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవండి. నవధాన్యాలను నవగ్రహాలకు సంకేతంగా భావిస్తుంటారు. సూర్యుడికి గోధుమలు, చంద్రుడికి బియ్యము, కుజ గ్రహానికి కందులు, బుధ గ్రహానికి పెసలు, గురు గ్రహానికి సెనగలు, శుక్ర గ్రహానికి బొబ్బర్లు, శని గ్రహానికి నువ్వులు, రాహుగ్రహానికి మినుములు, కేతు గ్రహానికి ఉలవలు అధీన ధాన్యాలుగా పరిగణిస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

ఇకపోతే నవధాన్యాలను దైవకార్యాల్లోను ... శుభకార్యాలలోను ఉపయోగిస్తారు. వివాహ సమయంలో ఈ నవధాన్యాలను మట్టి మూకుళ్లలోపోసి ఉంచడమనే ఆచారం వుంది. అవి మొలకెత్తి బాగా పెరిగితే ఆ దాంపత్యం అన్యోన్యంగా ఉంటుందని భావిస్తారు.

అంతే కాకుండా నవధాన్యాల ... నవగ్రహాల అనుగ్రహం వారిపై బాగానే ఉంటుందని విశ్వసిస్తారు. నవధాన్యాలు ఎన్నో ఔషధ గుణాలను కలిగి వుండి ... ఎంతో బలమైన పోషకాలను అందిస్తాయి. ఆ పోషకాలను స్వీకరిస్తూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని కొనసాగించమనే అర్థం కూడా ఇందులో వుందని పండితులు అంటున్నారు.దీనిపై మరింత చదవండి :