సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 31 ఆగస్టు 2020 (18:37 IST)

బ్రహ్మంగారి కాలజ్ఞానం.. వేశ్యల వల్ల భయంకరమైన రోగాలు.. డబ్బే..??? (video)

శ్రీ పోతులూరి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎన్నో అంశాల గురించి చెప్పివున్నారు. అందులో కొన్నింటిని తెలుసుకుందాం.. పంటలు సరిగా పండక పాడి పశువులు సరిగా పాలివ్వక భయంకరమైన కరువు సంప్రాప్తిస్తుంది. రాజులు ధర్మాన్ని మరిచి విందులు వినోదాల్లో మునిగి ధర్మ భ్రష్టులౌతారు. 
 
వేశ్యల వలన ప్రజలు భయంకర రోగాలకు గురి ఔతారు. మనుషులు వావి వరసలు లేకుండా ప్రవర్తిస్తారు వారికి డబ్బే ప్రధానం ఔతుంది. దుర్మార్గులు రాజులౌతారు. మంచి ప్రవర్తన కలవారు భయంకర కష్టాలపాలై హీనంగా మరణిస్తారు. జనుల కడుపులో మంటలు పుడతాయి. నోటిలో బొబ్బలు లేస్తాయి. నెత్తురు కక్కుతూ, రోగాల పాలై జనులు మరణిస్తారు. జంతువులూ అలాగే చస్తాయి.
 
శాంతమూర్తులకు కూడా కోపం విపరీతంగా వస్తుంది. వివిధ వర్ణాల వారు తమ ధర్మం వదిలి ఇతర ధర్మాలను ఆచరించి నాశనం ఔతారు. వావి వరసలు గౌరవ మర్యాదలు క్షీణించి తండ్రి కొడుకును కొడుకు తండ్రిని దూషిస్తారు. 
 
నీళ్ళతో దీపాలను వెలిగిస్తారు. ఇతర దేశస్తులు భారతదేశాన్ని పాలిస్తారు. అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి. మతకలహాలు పెరిగి ఒకరిని ఒకరు చంపుకుంటారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో పేర్కొని వున్నారు.