శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 29 ఆగస్టు 2023 (19:03 IST)

బిల్వం శివునికి ప్రీతికరం ఎలా అయ్యింది..

పాలకడలిలో శయనిస్తున్న విష్ణుమూర్తిని తన పతిగా చేసుకునేందుకు శ్రీ మహాలక్ష్మీ సంకల్పించుకుంది. విశ్వమూర్తి అయిని విష్ణువు వక్ష స్థలంలో కొలువై వుండాలని భావించింది. త్రిలోకి అనే ప్రాంతంలో మహేశ్వరుడిని తలచి తపస్సు చేపట్టింది. అక్కడ వెలసిన త్రిలోక్యా సుందరుడిని పూజించాలని.. విష్ణుమూర్తిని పొందాలని శ్రీ లక్ష్మి తలచింది. 
 
ఆ సమయంలో ఈశ్వరుడిని ఎలా పూజించాలో తెలియక ఆమె పరిపరివిధాలుగా ఆలోచించింది. ఆమెకు ఏమీ తోచలేదు. చివరికి ఆమె ప్రాణాన్ని త్యాగం చేయాలని బావించింది. లక్ష్మీదేవి ఆమె ప్రాణాన్ని మూడు భాగాలుగా చేసి.. ఈశ్వరుడి అనుగ్రహం పొందింది. శివానుగ్రహంతో ఆమె సంకల్పం సిద్ధించింది. 
 
అలా మహాలక్ష్మీ కూర్చున్న ప్రాంతంలో అద్భుతం జరిగింది. పచ్చని ఆకులతో కొండ వెలసింది. ఆ ప్రాంతంలో బిల్వం మొలిచింది. ఆమె ప్రాణశక్తిని మూడుగా విభజించడంతో బిల్వ పత్రం మూడు ఆకులుగా మొలిచింది. ఆపై ఏకరూపం దాల్చింది. అలా బిల్వ పత్రం ఏర్పడింది. 
 
శివునికి ప్రీతికరంగా మారింది. అందుకే బిల్వ అర్చనతో అనుకున్నది సాధించగలుగుతారు. బిల్వం మహాలక్ష్మీ స్వరూపం. ఆమె అనుగ్రహం కోసం బిల్వంతో శివుడిని పూజిస్తే చాలునని కోరిన కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.