అవసరం లేకపోయినా సెల్‌ఫోన్స్ కొంటున్నారా? జాగ్రత్త సుమా!
ఏ వస్తువును తరచుగా మార్చవద్దు. కొత్త మోడల్ కనిపించగానే దాన్ని కొనటం ఖర్చుతో కూడుకున్నదవుతుంది. కొంతమంది సెల్‌ఫోన్ల మీద పెట్టే ఖర్చు చూస్తే కళ్ళు తిరగడం ఖాయం.
నిజానికి ఒక వ్యక్తికి ఒక సెల్‌ఫోన్ చాలు. మరీ బిజీగా ఉండే బిజినెస్‌మేన్‌కి, అర్జంటుగా ఎక్కువమందితో టచ్‌లో ఉండాల్సిన ఎగ్జిక్యూటివ్‌లకు మాత్రమే ఒకటికన్నా ఎక్కువ సెల్‌ఫోన్ అవసరమౌతుందేమో. అవసరం లేకపోయినా సెల్‌ఫోన్లు ముచ్చటపడి కొంటే మాత్రం పొదుపు కష్టమే అంటున్నారు నిపుణులు.
సెల్‌ఫోన్ కొత్త మోడల్స్ కొనడం.. సెల్‌ఫోన్ మీద చెల్లించే డబ్బులే కాదు.. ఆ ఫోన్ల వాడకంతో కట్టే బిల్లులు కూడా వృథానే. సెల్‌ఫోన్లు ప్రతివారం ఒక కొత్త మోడల్ తాడా ఫీచర్స్‌తో వస్తూనే ఉంటాయి. అందరికన్నా ఆలస్యంగా కొన్నవాడి దగ్గర సెల్‌ఫోన్ చక్కటి మోడల్‌ది ఉంటుంది. దాన్ని చూడగానే దానిని తాము సొంతం చేసుకోవాలని వెంటనే షాపులకు పరిగెడుతుంటారు.
సెల్‌ఫోన్లు, వాటికి సంబంధించిన ఛార్జర్స్, ఇతర కవర్స్‌తో యువతీ యువకుల టేబుల్స్ గందరగోళంగా నిండి ఉంటాయి. అందుకని ఎలక్ట్రానిక్ వస్తువులను కొద్దికాలం పాటే వాడేసి పారేయకండి. వాటి కాలపరిమితిని బట్టి వాడటం.. కొత్త వస్తువులను కొనాలని ముచ్చటపడటం మానేస్తే మీరు పొదుపు చేసినవారవుతారని నిపుణులు అంటున్నారు.