శనివారం, 30 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : బుధవారం, 19 సెప్టెంబరు 2018 (11:16 IST)

బ్రహ్మ దేవుని గురించి తెలుసా..?

సృష్టికర్త అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది బ్రహ్మదేవుడు. బ్రహ్మ నాలుగు ముఖాల నుండి నాలుగు వేదాలు ఆవిర్భవించాయి. బ్రహ్మకు పూజార్హత లేదని లోక నానుడి ఉన్నా, సమస్త వేద వాంగ్మయరూపంలో జ్ఞాన నిధిగా బ్రహ్

సృష్టికర్త అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది బ్రహ్మదేవుడు. బ్రహ్మ నాలుగు ముఖాల నుండి నాలుగు వేదాలు ఆవిర్భవించాయి. బ్రహ్మకు పూజార్హత లేదని లోక నానుడి ఉన్నా, సమస్త వేద వాంగ్మయరూపంలో జ్ఞాన నిధిగా బ్రహ్మ దర్శనమిస్తుంటారు. వేదోద్ధారక గోవిందా కలియుగ వైకుంఠం తిమమల గిరులకు పైన 5 కిలోమీటర్ల దూరంలో శ్రీవేంకటేశ్వర వేదవిజ్ఞాన పీఠం ఉంది.
 
వేద ఘోషతో దానికి వేదరిగి అనే పేరు కూడా ఉంది. ఆ వేదపాఠశాల ప్రాంగణంలో అద్భుతమైన బ్రహ్మ విగ్రహం ఉంది. బ్రహ్మ కుడిచేతిలో చిన్ముద్ర, ఎడమచేతిలో పుస్తకం ధరించి, వెనుక చేతులలో కుడివైపు జపమాల, ఎడమవైపు కమండలం పట్టుకుని ఉంటారు. చిన్ముద్రలో చూపులువేలు, బొటనవేలు కలిసి ఉంటుంది. చూపుడు వేలు జీవాత్మకు, బొటనవేలు పరమాత్మకు ప్రతీక. 
 
పుస్తకం జ్ఞానరూపం. సమస్త వేదసంపద పుస్తకరూపంలో బ్రహ్మ ఎడమచేతిలో ఉంటుంది. బ్రహ్మ వాహనం హంస. బ్రహ్మ భార్యకు సరస్వతీ, గాయత్రీ, బ్రహ్మాణీ, సావిత్రి అనే పేర్లు గలవు. బ్రహ్మకు ఎర్రని పట్టు వస్త్రాలంటే చాలా ఇష్టం. ఈయన ద్వారపాలకులు ఎనిమిది మంది. ప్రాచీనకాలం నుండి బ్రహ్మను ఆరాధించే సంప్రదాయం ఉంది. బ్రహ్మను ధాత, విధాత, ప్రజాపతి అనే పేర్లతో పిలుస్తుంటారు.