కార్తీకమాసంలో ఛట్ పూజ.. సూర్యునికి ఇలా అర్ఘ్యమిస్తే.. రాగి నాణేలను..?
కార్తీకమాసంలో ఛట్ పూజను జరుపుకుంటారు. ఛట్ పూజను దళ ఛట్, ఛతి, సూర్య షష్ఠి అని కూడా అంటారు. మన ప్రాచీన పండుగల్లో ఛట్ పూజ ఒకటి. భూమ్మీద తమకు మనుగడ కల్పిస్తున్న సూర్యభగవానుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఆయురారోగ్య, ఆనందాలను ప్రసాదించమని ప్రార్ధిస్తారు. పాండవులు, ద్రౌపది ఛట్ పూజ చేసినట్లు మహాభారతంలో కథనాలు ఉన్నాయి.
సూర్య భగవానుడిని ఆరాధించడానికి అంకితం చేయబడిన గౌరవప్రదమైన పండుగ ఛత్ పూజ. ఈ పండుగ నవంబర్ 5, 2024న ప్రారంభమవుతుంది. కార్తీక శుక్ల పక్షంలోని ఆరవ రోజున జరుపుకునే ఈ పండుగ నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది.
ఇంరా అర్ఘ్య సమర్పణతో ముగుస్తుంది. నవంబర్ 8న ఈ పూజ ముగుస్తుంది. ఈ సమయంలో, మహిళలు తమ కుటుంబ ఆరోగ్యం, విజయం, దీర్ఘాయువు కోసం సూర్యుడి దీవెనలు కోరుతూ 36 గంటల పారు నీరు లేని ఉపవాసాన్ని ఆచరిస్తారు.
నవంబర్ 5వ తేదీన మొదటి రోజు, గృహాలను పూర్తిగా శుభ్రం చేస్తారు. భక్తులు స్నానమాచరించి ఉపవాస దీక్షలు చేయడంతో పూజాదికాలు ప్రారంభమవుతాయి. శెనగ పప్పు, గుమ్మడికాయ కూరతో చేసిన వంటకాలను సూర్యునికి ప్రసాదంగా సమర్పిస్తారు.
నవంబర్ 6న ఈ రోజు పగటిపూట ఉపవాసం ఉంటారు. మట్టి పొయ్యిపై వండిన బెల్లం-తీపితో చేసిన వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తారు.
నవంబర్ 7 - మొదటి అర్ఘ్య: కృతజ్ఞత, గౌరవానికి ప్రతీకగా అస్తమించే సూర్యునికి అర్ఘ్యం సమర్పించడానికి భక్తులు సాయంత్రం నీటి వనరుల వద్దకు చేరుకుంటారు.
నవంబర్ 8 - ఛత్ ముగింపు: సూర్యోదయం సమయంలో చివరి అర్ఘ్య సమర్పణతో పండుగ ముగుస్తుంది.
సూర్య భగవానుడికి పవిత్రమైన నది ద్వారా పచ్చి బియ్యం, బెల్లం సమర్పిస్తారు. ఇలా చేస్తే సూర్యుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. అందుకే సూర్యుడికి పాలు, బియ్యం, బెల్లంతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు.
ఛత్ పూజ సమయంలో రాగి నాణెమును ప్రవహించే నదిలో నిమజ్జనం చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అలాగే గోధుమలు, బెల్లం సూర్యునికి సమర్పించడం.. ఆపై దానం చేయడం ఆచారంగా వస్తోంది.