అక్టోబర్ 29న ధన త్రయోదశి.. ఇవి కొనండి.. ఇవి కొనొద్దు..
ధన త్రయోదశి పండగ అక్టోబర్ 29న జరుపుకుంటారు. దీపావళి, ధనత్రయోదశి రోజున వెండి, బంగారాన్ని కొనుగోలు చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అక్టోబర్ 29న ఉదయం 10:31 గంటలకు ధన త్రయోదశి శుభ ముహూర్తం ప్రారంభమై.. అక్టోబర్ 30 మధ్యాహ్నం 1:15 గంటల వరకు ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే ఏడాదంతా శుభం జరుగుతుందని, ఆరోగ్యం, సిరిసంపదలు నిండుతాయని విశ్వాసం. ఈ రోజున ధన్వంతరీ, లక్ష్మీ దేవి, వినాయకుడు, కుబేర దేవతలను పూజిస్తుంటారు. ముఖ్యంగా బంగారం, వెండి లక్ష్మీదేవికి బాగా ప్రీతికరమైనవి కావడంతో వీటిని కొనుగోలు చేస్తారు. అందుకే ప్రతి ఏడాది ధన త్రయోదశి రోజున పసిడి కొనుగోళ్లు ఎక్కువగా నమోదవుతుంటాయి. అయితే పదునైన వస్తువులు ఇనుముతో తయారు చేసిన వస్తువులను లేదా కత్తులు, కత్తెరలు, గొడ్డలి వంటి పదునైన వస్తువులను కొనవద్దు.
ఎందుకంటే అవి ప్రతికూల శక్తులను ఆకర్షిస్తాయి. నలుపు రంగు చీకటిని, దురదృష్టాన్ని సూచిస్తుంది. కనుక దుస్తులు, పాత్రలు లేదా అలంకరణకు ఉపయోగించే వస్తువులను నలుపు రంగు వస్తువులను కొనుగోలు చేయకుండా ఉండాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఉపయోగించిన లేదా సెకండ్ హ్యాండ్ వస్తువులను కొనవద్దు.