గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 నవంబరు 2024 (09:47 IST)

కార్తీక సోమవారం.. నువ్వులు దానం చేస్తే?

Karthika Masam
Karthika Masam
కార్తీక సోమవారం రోజున శివారాధన చేయడం ద్వారా మోక్షం సిద్ధిస్తుంది. మహిళలకు దీర్ఘ సుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది. కార్తీకమాస వ్రతవిధానములలో సోమవారం ఉపవాసం ఉండటం ఎంతో ప్రత్యేకమైనది. ఈ రోజున నిష్ఠతో పరమశివునికి బిల్వపత్రాలతో పూజ చేస్తే అత్యంత పుణ్యప్రదాయకము. 
 
సాయంత్రం పూట శివాలయంలో శివుని పూజించి ఆవునెయ్యితో దీపాన్ని వెలిగించి తిరిగి ఇంటికి వచ్చి, ఇంట్లో తులసి చెట్టు దగ్గర దీపమును వెలిగించాలి. ఆపై ఉపవాసమును విరమించాలి.  పగలంతా ఉపవాసము ఉంటే నక్షత్రాలు చూసిన తరువాత భోజనం చేయవచ్చును. 
 
ఈ విధానమును నక్తం అని అంటారు. ఏవీ చేయలేని వారు సోమవారం రోజున నువ్వులు దానం చేసినా వ్రతఫలము దక్కుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
Karthika Masam
Karthika Masam
 
కార్తీక సోమవారం వ్రతం ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలు
 
శుభప్రదమైన కార్తీక సోమవారాల్లో శివుడిని ప్రసన్నం చేసుకోవచ్చు.
1. మంచి జీవిత భాగస్వామిని, భర్త దీర్ఘాయువును పొందండి
2. మంచి ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు లభిస్తుంది.
3. రుణ రహిత జీవితాన్ని ఆస్వాదించండి
4. ప్రశాంతమైన వ్యక్తిగత జీవనం, వ్యాపారాభివృద్ధి. 
5. పాపాలను విముక్తి.. మోక్షం లభిస్తుంది.