బుధవారం, 18 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 అక్టోబరు 2022 (22:35 IST)

ద్వాత్రింశన్నామావాళిని పఠిస్తే?

durgashtami
సహస్ర నామాలను వెయ్యి సార్లు పారాయణం చేస్తే వచ్చే ఫలితాన్ని ఒకేసారి పఠిస్తే ఇచ్చే దుర్గాదేవి.. ద్వాత్రింశన్నామావాళిని.. శత్రువుల బాధ వున్నవారు, భయాల్లో వున్నవారు, కష్టాల్లో వున్నవారు ఎవరైనా సరే 32 నామాలతో అమ్మవారిని స్తోత్రం చేస్తో పడిపోతున్న వారికి చేయందించి పైకి లాగుతుంది.. అమ్మవారు. ఈ 32 నామాలకు అంత శక్తి వుందంటున్నారు.. ఆధ్యాత్మిక పండితులు. ఈ 32నామాల దుర్గాదేవి ద్వాత్రింశన్నామావాళిని 108 సార్లు పారాయణం చేస్తే సర్వ దరిద్రాలు తొలగుతాయి.
 
దుర్గాదేవి-ద్వాత్రింశన్నామావాళి
దుర్గా దుర్గార్తి శమణీ, దుర్గాపద్వినివారిణీ దుర్గమచ్చేదినీ, దుర్గసాధినీ, దుర్గనాశినీ దుర్గతోద్ధారిణీ, దుర్గనిహంత్రీ, దుర్గమాపహ దుర్గమదేజ్ఞానదా, దుర్గ దైత్యలోకదవానలా దుర్గమ, దుర్గమాలోక, దుర్గమాత్మస్వరూపిణీ దుర్గమార్గాప్రద, దుర్గమావిద్యా, దుర్గమాశ్రిత దుర్గమజ్ఞానసంస్థాన, దుర్గమధ్యానభాసిని దుర్గమోహ & దుర్గమగ, దుర్గమర్థస్వరూపిణీ దుర్గమాసుర సంహంత్రి, దుర్గమాయుధదారిణీ దుర్గమాంగీ, దుర్గమత, దుర్గమ్య, దుర్గమేశ్వరీ దుర్గభీమా, దుర్గభామా, దుర్లభా, దుర్గధారిణీ.. ఇవి దుర్గాదేవి 32 నామాలు.