ఆశ లేనివారికి దుఃఖ బాధలుండవు, ఆశ పడే వారికి లేని బాధలుండవు

సోమవారం, 5 ఏప్రియల్ 2021 (23:01 IST)
అత్యాశ ఉన్న జీవితం విరగ కాసిన చెట్టు లాంటిది. వాస్తవానికి సృష్టిని నడిపించే ఇంధనం-ఆశ. తగు మోతాదులో వినియోగిస్తేనే జీవిత నౌక సాఫీగా సాగుతుంది. పోటీపడే వారంతా విజేతలు కావాలనే ఆశిస్తారు. గెలిచేది ఒక్కరే అయినా పోటీపడటం మానరు. గెలవలేమేమో అనే నిరాశ వారిలో తలెత్తనే కూడదు. అలాగే అర్హత, స్థాయి, స్థోమత లేని వాటికోసం ఆశ పడటం అనర్ధదాయకం. ఆశకు అంతుండదంటారు అనుభవజ్ఞులు. అనంతమైన ఆశ తన వెంట పడే వారిని పరుగులు పెట్టిస్తుంది. 
 
పరుగెత్తేకొద్దీ తీరిక లేకుండా చేసి ఇంకా తనవైపు ఆకర్షితుల్ని చేయడం దాని లక్షణం. ఆశించింది దొరికితే మరికొంత కావాలని మనిషి కోరుకుంటాడు. అదీ అమరితే మరొకటి కావాలని ఆత్రపడతాడు. అంతేతప్ప ఇక్కడితో ఆగుదాము అనుకోడు. ప్రమిదలో వత్తి లాంటిది ఆశ. అది ఉండేంతవరకు చమురు పోస్తే వెలుగునిస్తుంది. మునిగేంతగా పోస్తే, చీకటినే మిగుల్చుతుంది. ఆశ మనిషికి లోబడి ఉండాలి. కానీ మనిషి ఆశకు లోబడిపోకూడదు. ఆశ లేనివారికి దుఃఖ బాధలుండవు. ఆశ పడే వారికి లేని బాధ లుండవు. 
 
తమకున్నదానితో సంతృప్తి పడేవారు సంతోషం చవిచూస్తారు. అలా కానివారు కోల్పోతారు. అవగాహన, ప్రణాళిక, పట్టుదల, తగిన కృషి ఉంటే ఆశలు వాటంతట అవే నెరవేరతాయి. ఆశ అనేక రూపాలలో ఉంటుంది. మనిషి నిరాశ, అత్యాశ, దురాశల్లో కూరుకుపోవడం మంచిది కాదు. నిరాశ అతణ్ని నిర్వీర్యుడిగా చేస్తుంది. నిరాశ ఉందని గుర్తించిన తర్వాత ఏదో ఒక విధంగా దానిని తొలగించుకోవాలి. ఆ స్థానంలో ఆశావహ దృక్పధం పెంచుకోవాలి. 
 
అత్యాశ కలిగిన వాళ్లు సుఖసంతోషాలకు దూరమవుతారు. దురాశ వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి. చెడు ఆశల మూలాన వాటిల్లే అనర్ధాలకు విరుగుడు లేదు. లోకంలో అసంతృప్తికి మించిన దారిద్ర్యం లేదు. సంతృప్తిపరుడు పొందే సుఖాన్ని ఎంతటి చక్రవర్తి అయినా పొందలేడు. ఆశలు మనసులో ఉండాలి. వాటిని నెరవేర్చుకునే ఆలోచనలు మెదడులో ఉండాలి. వాటిని ఫలవంతం చేసుకునే కృషి, మనిషి చేతుల్లో ఉండాలి.

అన్నీ చూడండి

ముంబైలో మళ్లీ కరోనా కేసులు.. రుతుపవనాలు లేటు కావడమే కారణం

ట్రేడింగ్‌లో నష్టపోయాడు.. కిడ్నాప్ అయ్యానని రూ.50లక్షలు డిమాండ్ (video)

కుటుంబ కలహాలు.. బిస్కెట్లలో ఎలుకల మందు పెట్టి ఇద్దరు పిల్లల్ని చంపేసిన తల్లి

హైదరాబాద్‌లో నీట్ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య.. పాసవుతామో లేదోనని..?

సీఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లో లీకైన అమ్మోనియా.. 67మంది కార్మికులకు ఏమైంది?

అన్నీ చూడండి

21-06-2026 - ఆదివారం మీ రాశి ఫలితాలు - రుణవిముక్తులవుతారు

సత్వ గుణం అంటే ఏమిటి? భగవద్గీతలో కృష్ణుడు చెప్పిందేమిటి?

21-06-2026 నుంచి 27-06-2026 వరకు వార ఫలితాలు - మీ మాటకు తిరుగుండదు

20-06-2026 శనివారం ఫలితాలు.. కొత్తవారిని నమ్మవద్దు..

తిరుమల శ్రీవారి గడ్డానికి పచ్చకర్పూరం ఎందుకు రాస్తారు?

తర్వాతి కథనం
Show comments