శనివారం, 30 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : శనివారం, 7 జులై 2018 (16:33 IST)

ఏలినాటి శని దోషాలు తొలగిపోవాలంటే?

శని అనే పేరు వినగానే ఎంతటి వారైనా భయపడిపోతారు. సాక్షాత్తు ఈశ్వరుడినే తిప్పలు పెట్టిన శనీశ్వరుడు, విక్రమార్క మహారాజును కూడా నానాఅవస్తలు పెట్టాడు. తనకి ఏలినాటి శని ఏడున్నర సంవత్సరాల పాటు పట్టనున్నదని తె

శని అనే పేరు వినగానే ఎంతటి వారైనా భయపడిపోతారు. సాక్షాత్తు ఈశ్వరుడినే తిప్పలు పెట్టిన శనీశ్వరుడు, విక్రమార్క మహారాజును కూడా నానాఅవస్తలు పెట్టాడు. తనకి ఏలినాటి శని ఏడున్నర సంవత్సరాల పాటు పట్టనున్నదని తెలుసుకున్న విక్రమార్కుడు, శనీశ్వరుడి కోసం తపస్సు చేశాడు. ఆయన అభ్యర్ధనను మన్నించిన శనీశ్వరుడు ఏడున్నర సంవత్సరాల కాలం అనే లెక్కను తగ్గించుకుని ఏడున్నర ఘడియల పాటు మాత్రమ తన బారిన పడక తప్పదని చెప్పాడు.
 
దాంతో ఆ ఏడున్నర ఘడియలు అడవిలో గడపడం మంచిదని భావించి మారు వేషంలో విక్రమార్క మహారాజు అక్కడికి వెళ్లాడు. సరిగ్గా ఆ సమయంలోనే ఒక దొంగ కోసం గాలిస్తోన్న మరో రాజ్యపు రక్షక భటులకు విక్రమార్కుడి దగ్గరలోనే నగలమూట కనిపించింది. దాంతో వాళ్లు విక్రమార్కుడిని తీసుకు వెళ్లి తమ రాజుగారి ముందు ప్రవేశపెట్టారు.
 
ఆ రాజు విక్రమార్కుడికి ఉరిశిక్షను అమలు చేయమని ఆదేశించాడు. అప్పటికే ఏడు ఘడియలు కావడంతో అరఘడియ సేపు ఆగిన తరువాత తనకి ఆ శిక్ష అమలు పరచమని విక్రమార్కుడు ఆ రాజును వేడుకున్నాడు. అతని మాటతీరు ప్రవర్తన చూసిన రాజు అందుకు అంగీకరించాడు. సరిగ్గా అరఘడియ దాటగానే అసలు దొంగ దొరికాడంటూ రక్షక భటులు ఓ వ్యక్తిని అక్కడికి తీసుకువచ్చారు.
 
దాంతో విక్రమార్కుడు తన వేషం తీసేశాడు. అందరూ ఆశ్చర్యపోతూ ఆయనను మర్యాద పూర్వకంగా నమస్కరించారు. ముందుగానే ఆ సంగతి చెప్పవచ్చు కదా అని అడిగారు. శని ప్రభావం ఉన్నప్పుడు ఏం చెప్పినా ప్రయోజనం ఉండదంటూ తన రాజ్యానికి చేరుకున్నాడు. ఆ రోజు నుండి ప్రతి శనివారం శనీశ్వరునికి అభిషేకాలు, పూజలు చేస్తూ చిమ్మిలి నైవేద్యంగా పెట్టేవారు.