Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గు అంటే అదో పాజిటివ్ సైన్... దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది...

Written By సిహెచ్
Updated: శుక్రవారం, 11 మార్చి 2022 (23:38 IST)
ఏ దేవత పూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా, నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి. నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది.


అంతేకాదు, మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా. యంత్ర, తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డశక్తులను దరిచేరనీయవు. అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు. తులసి మొక్క దగ్గర అష్టదళపద్మం వేసి దీపారాధాన చేయాలి.

 
యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులేయాలి. దైవకార్యలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి. నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుప్రక్కల లతలు, పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులు వేయాలి.

 
దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు. ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు. ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ, అమ్మవారు, శ్రీ మహావిష్ణు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో, ఆ స్త్రీకి 7 జన్మలవరకు వైధవ్యం రాదని, సుమంగళిగానే మరణిస్తుందని దేవి భాగవతం, బ్రహ్మాండ పురాణం చెబుతున్నాయి. పండుగ వచ్చిందా కదా అని, నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు. అంతేకాదండోయ్! మనం రోజూ ముగ్గులు వేయలేక పెయింటింగ్ వేస్తాం. దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు. ఏ రోజుకారోజు బియ్యపుపిండితో ముగ్గు పెట్టాలి. నిత్యం ఇంటి ముందు, వెనుక భాగంలో, తులసి మొక్క దగ్గర, దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి. 

 
ముగ్గు అంటే అదో పాజిటివ్ సైన్... దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది... 
ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి. పూర్వం రోజూ సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ఇల్లిల్లూ తిరిగి బిక్ష అడిగేవారు. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వేళ్ళేవారు కాదు. వారే కాదు భిక్షగాళ్లు కూడా ముగ్గు లేని ఇళ్ళకు వెళ్ళి భిక్షం అడిగేవారుకాదు. ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు. అందుకే మరణించిన వారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటిముందు ముగ్గు వేయరు.

 
శ్రాద్ధకర్మ పూర్తైన వెంటనే, అది మధ్యాహ్నమైనా ముగ్గు వేస్తారు. ముగ్గులు వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి. మన ఆచరించే ఏ ఆచారమూ మూఢనమ్మకం కాదు. మన ఆచార, సంప్రదాయాలన్నీ అనేకానేక అర్ధాలు, పరమార్ధాలతో కూడినవి. అందుకే ఏ ఇంటి ముందు ముగ్గు లేదో... ఆ ఇంట్లో ఇల్లాలికి ఏమీ తెలియ‌ద‌ని అర్ధం.

అన్నీ చూడండి

దుబాయ్‌లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు (వీడియో)

ఇరాన్‌పై విజయం సాధించాక హర్మూజ్‌పై అమెరికా జెండా ఎగురవేస్తాం : డోనాల్డ్ ట్రంప్

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్డమే లక్ష్యం : ప్రధాని మోడీ

పాకిస్తాన్ స్వాతంత్ర్య వేడుకలు : బలూచిస్తాన్ ప్రావీన్స్‌ ప్రజల్లో కానరాని స్పందన

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు : ఇరాన్‌కు 2 టన్నుల బంగారం పంపిన యూఏఈ

అన్నీ చూడండి

15-08-2026 శనివారం మీ రాశి ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

14-08-2026 శుక్రవారం మీ రాశి ఫలితాలు- ఏ విషయానికీ కుంగిపోవద్దు...

అల్ప వర్షపాతం: తిరుమలలో వరుణ యాగం ఎందుకు జరపలేదంటే?

సమస్యలు.. వెలిగించాల్సిన దీపాలు.. అల్లం దీపాన్ని ఎందుకు వెలిగిస్తారంటే?

శ్రావణ మాసం... శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతికరం.. భక్తులకు నైతిక బలం..

తర్వాతి కథనం
Show comments