గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 మార్చి 2022 (23:39 IST)

అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. థీమ్ Imagine a gender equal world ఇదే!

మార్చి 8వ తేదీ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం. 2022 మార్చి 8న ఈ దినోత్సవ వేడుకలు 110 వసంతాలు పూర్తి చేసుకున్నాయి.  లింగ సమాన ప్రపంచాన్ని ఊహించుకోండనే థీమ్‌తో ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోనున్నారు.
 
ఈ ఏడాది అంతర్జాతీయ మహిళాదినోత్సవం థీమ్ #BreakTheBias - Imagine a gender equal world అంటే లింగ సమానత్వాన్ని సాధించడానికి 2022 సంవత్సరం కీలకమైనదిగా పరిగణింపబడుతోంది. 
 
ఇకపోతే.. ప్రతీ సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుతారు. ఈ దినోత్సవాన్ని మొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా పిలిచేవారు. వివిధ ప్రాంతాలలో ఈ ఆచరణ మహిళలకు గౌరవం, గుర్తింపు, హక్కుల కోసం ప్రారంభమైంది.