1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated: బుధవారం, 7 సెప్టెంబరు 2022 (14:45 IST)

భక్తులకు అలెర్ట్.. ఆ రెండు రోజుల్లో శ్రీవారి ఆలయం మూసివేత

Tirumala
తిరుమల శ్రీవారి ఆలయం రెండు రోజులు పాటు మూతపడనుంది. సూర్య, చంద్రగ్రహణాల కారణంగా మూసివేయనున్నారు. వచ్చేనెల 25, నవంబరు 8న తిరుమల శ్రీవారి ఆలయాన్ని అధికారులు మూసివేస్తున్నారు. అక్టోబరు 25న సూర్య గ్రహణం కారణంగా రాత్రి 7.30 వరకు, నవంబర్ 8న చంద్రగ్రహణం కారణంగా రాత్రి 7.20 వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్టు తితిదే అధికారులు వెల్లడించారు. 
 
ఈ రెండు రోజుల్లో ఆలయాలను మూసివేస్తున్నట్టు అన్ని రకాల దర్శనాలను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ఈ సందర్భంగా భక్తులు తమ పర్యటనను వాయిదా వేసుకోవాలని కోరుతున్నారు. ఇదిలావుండగా సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.46 కోట్లు ఆదాయం వచ్చిందని వచ్చిందని తితిదే అధికారులు తెలిపారు.