శనివారం, 18 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 16 డిశెంబరు 2024 (23:00 IST)

కలలో గణేషుడు కనబడితే ఏం జరుగుతుంది?

కలలు వస్తుంటాయి. కొన్ని కలలు గుర్తు వుంటాయి. కొన్ని గుర్తు వుండవు. కొన్ని కలలు శుభాలకు సూచికలయితే మరికొన్ని శకునాలను చూపిస్తాయని విశ్వాసం. ఐతే కొందరికి దేవుళ్లు కలలో కనిపిస్తుంటారు. ప్రత్యేకించి గణేశుడు కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాము.
 
ప్రధమ పూజనీయుడు గణేషుడు. అలాంటి గణనాథుడు కలలోకి వస్తే జీవితంలో శుభపరిణామాలు కలుగుతాయని చెబుతున్నారు జ్యోతిష నిపుణులు. జీవితంలో అన్ని అవరోధాలను అధిగమించి అన్ని విజయాలతో ముందుకు సాగుతారని ఆ కల తెలియజేస్తుంది. కనుక వినాయకుడు కలలోకి వచ్చాడంటే ఇక జీవితంలో తిరుగులేదనే అర్థం.