1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated: సోమవారం, 22 ఆగస్టు 2022 (21:02 IST)

24న ఉదయం 10 గంటలకు శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లు విడుదల

venkateswara swamy
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర్ స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే తమ ఈతి బాధలన్నీ తొలగిపోతాయని ప్రతి ఒక్క శ్రీవారి భక్తుడి ప్రగాఢ విశ్వాసం. అయితే, శ్రీవారి దర్శనం అంత సులంభంకాదు. సర్వదర్శనం క్యూ లైన్లలో వెళ్లితే కనీసం 24 గంటల పాటైనా వేచివుండాలి. ఇక అర్జిత సేవల టిక్కెట్లు దక్కాలంటే నిజంగానే అదృష్టం ఉండాలి. 
 
ఈ నేపథ్యంలో ఈ నెల 24వ తేదీన శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లను రిలీజ్ చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు ప్రకటించింది. అక్టోబరు నెలకు సంబంధించిన ఈ అర్జిత సేవా టిక్కెట్లను 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. 
 
అదే రోజున మధ్యాహ్నం 2 గంటలకు మరికొన్ని టిక్కెట్లను, లక్కీ డిప్ ద్వారా కేటాయించనున్నట్టు తెలిపింది. అలాగే, అక్టోబరు నెలకు సంబంధించి కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ తదితర వర్చువల్ సేవల దర్శనం కోటా టిక్కెట్లను కూడా ఆగస్టు 24వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు తితిదే అధికారులు వెల్లడించారు.