శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 29 నవంబరు 2019 (18:49 IST)

శ్రీవారి భక్తులకు చేదువార్త, వైకుంఠ ఏకాదశికి వైకుంఠ ద్వారాలు అన్ని రోజులు ఉండవట

శ్రీవారి భక్తులకు చేదు వార్త. వైకుంఠ ఏకాదశి రోజు 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలను తెరిచే ఉంచుతామని టిటిడి గతంలో నిర్ణయం తీసుకుంది. అది కూడా శ్రీరంగం ఆలయ తరహాలో ఆలయాన్ని తెరిచే ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. 
 
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో మాత్రమే సాధారణంగా దర్సనం చేసుకుంటుంటారు. అయితే ప్రస్తుతం ఆగమ శాస్త్రబద్థంగా, ఆగమ సలహాదారుల నిర్ణయాలు తీసుకునే పనిలో పడ్డారు టిటిడి ఉన్నతాధికారులు. ఈ విషయాన్ని స్వయంగా టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి వెల్లడించారు. 
 
ప్రస్తుతానికి ఇదే విషయంపై ఆగమ సలహాదారులతో చర్చలు జరుగుతోంది. స్వామివారికి సంబంధించిన విషయాలేవీ ఆషామాషీ కాదు. ఆచితూచి అడుగులు వేయాలి. నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. అదే పనిచేస్తున్నాం. ప్రస్తుతానికి అయితే పాత పద్ధతినే కొనసాగించాలన్న నిర్ణయంలో ఉన్నాం. ఆ తరువాత దైవేచ్ఛ అంటూ టిటిడి ఛైర్మన్ తెలిపారు. దీన్నిబట్టి వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారాలు పదిరోజుల పాటు తెరిచే అవకాశం ఏ మాత్రం కనిపించడం లేదు.