శ్రీవారి భక్తులకు శుభవార్త..
తిరుమలలో ప్రస్తుతం వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినం రోజులోనే భక్తులును వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. వైకుంఠం ద్వారం గుండా స్వామి వారిని దర్శిచుకోవాలని భక్తులు కోరుకుంటారు. అయితే భక్తులు రద్దీని దృష్టిలో పెట్టుకొని 10 రోజులు పాటు వైకుంఠ ద్వార మహోత్సవం పేరుతో ద్వారాలును తెరవాలని టీటీడీ భావిస్తోంది.
10 రోజులు పాటు వైకుంఠ ద్వారాలు గుండా భక్తులను అనుమతించేందుకు ఆగమ సలహామండలి కూడా ఆమోదం తెలిపింది. ఇక పాలకమండలి ఆమోదం పొందితే ఈ ఏడాది నుంచే నూతన విధానం అమలులోకి రానుంది.