శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 17 మార్చి 2018 (12:55 IST)

పీవీ సింధు అదుర్స్.. తొలిసారి ఆల్ ఇంగ్లండ్ సెమీఫైనల్లోకి ఎంట్రీ

ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన సత్తా ఏంటో చాటింది. మహిళల సింగిల్స్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌తో మెరుగైన ఆటతీరుతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించింది. జపాన్‌కు చెందిన ఏడో సీ

ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన సత్తా ఏంటో చాటింది. మహిళల సింగిల్స్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌తో మెరుగైన ఆటతీరుతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించింది. జపాన్‌కు చెందిన ఏడో సీడ్ నోజోమీ ఒకుహరాతో జరిగిన మ్యాచ్‌లో పీవీ సింధు అదరగొట్టింది. తద్వారా పీవీ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. 
 
అలాగే క్వార్టర్ ఫైనల్ తొలిగేమ్‌లో వెనుకబడిన సింధు తర్వాత పుంజుకుని వరుసగా రెండు గేముల్లోనూ ఒకుహరాకు చుక్కలు చూపించింది. ఫలితంగా 20-22, 21-18, 21-18 పాయింట్ల తేడాతో గెలుపును నమోదు చేసుకుంది. గంటన్నర పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో పీవీ సింధు ఆద్యంతం అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంది. 
 
ఫలితంగా ఈ మ్యాచ్ గెలుపుతో సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానానికి చేరుకుంది. గతంలో ఐదు పర్యాయాలు కూడా ఆల్ ఇంగ్లాండ్‌లో సింధు క్వార్టర్స్‌తోనే సరిపెట్టుకుంది. కానీ తొలిసారిగా ఈ  ఏడాది ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.