ఆదివారం, 12 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 7 ఏప్రియల్ 2018 (16:13 IST)

కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం.. హాకీ ఆటగాళ్లు దుర్మరణం

కెనడా దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హాకీ జట్టులోని 28 మంది ఆటగాళ్ళలో 14 మంది మృత్యువాతపడ్డారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం సస్‌కచివాన్ రాష్ట్రంలో శనివారం జరిగింది.

కెనడా దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హాకీ జట్టులోని 28 మంది ఆటగాళ్ళలో 14 మంది మృత్యువాతపడ్డారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం సస్‌కచివాన్ రాష్ట్రంలో శనివారం జరిగింది. 
 
ఐస్ హాకీ జట్టు ఆటగాళ్ళంతా కలిసి బస్సులో వెళుతున్నారు. ఈ బస్సు జాతీయ రహదారిపై వెళుతున్న ట్రక్కును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రమాద స్థలంలోనే కన్నుమూశారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. 
 
వీరంతా జూనియర్ హాకీ ఆటగాళ్లే. దీంతో కెనడాలో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.