ఆస్ట్రేలియన్ ఓపెన్: క్వార్టర్ ఫైనల్లోకి మరియా షరపోవా
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో రష్యాబ్యూటీ మరియా షరపోవా క్వార్టర్ పైనల్స్‌కు దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆమె 21వ సీడ్ పెంగ్ షుయ్ 6-3, 6-0 తేడాతో ఓడించింది.
మహిళల సింగిల్స్ టైటిల్ రేసులో ఉన్న షరపోవా తన స్థాయికి తగినట్టుగానే మెరుగ్గా ఆడుతూ దూసుకెళుతున్నది. కాగా, రష్యాకే చెందిన ఎకతెరిన మకరొవా కూడా ముందంజ వేసింది. ప్రీ క్వార్టర్స్‌లో ఆమె జూలియా జార్జెస్ (జర్మనీ)పై 6-3, 6-2 ఆధిక్యంతో విజయం సాధించింది.
సిమోన హాలెప్ 6-4, 6-2 తేడాతో యనినా విక్‌మేయర్‌పై గెలుపొందింది. యెవ్గెనీ బుచార్డ్ 6-1, 5-7, 6-2 ఆధిక్యంతో ఇరినా కామెల్లా బెగూను ఓడించింది. క్వార్టర్స్‌లో షరపోవాను బుచార్డ్ ఢీ కొంటుంది.