మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 30 జులై 2021 (22:33 IST)

టోక్యో ఒలింపిక్స్‌.. ఈ పిల్లి వీడియో వైరల్.. ఏం చేస్తుందో చూడండి..

Cat
టోక్యో ఒలింపిక్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఏముందంటే.. ఓ ఇంటిలో టెలివిజన్ ముందు కూర్చున్న ఓ పిల్లి జిమ్నాస్ట్‌ ప్రదర్శనను కాన్సంట్రేషన్‌తో చూస్తోంది. టీవీలోని జిమాస్ట్‌ కదలికలకు అనుగుణంగా అనుకరిస్తుంది. ఈ క్రమంలోనే డిజిటల్ తెర ఎటు వైపుగా మారితే అటు వైపునకు పిల్లి తన తలను కూడా ఆడిస్తుంది. 
 
అంతటితో ఆగకుండా తన చేతులతో జిమ్నాస్ట్‌ను పట్టుకునేందుకు క్యాట్ ప్రయత్నిస్తుంది. రెండు చేతులను టీవీ మీదకు పెట్టి జిమ్నాస్ట్‌తోపాటు అటు ఇటు తిరుగుతూ హుషారుగా కనిపిస్తోంది. 54 సెకన్ల నిడివిగల ఈ వీడియోను హ్యూమర్‌ అండ్‌ ఎనిమల్స్‌ అనే ట్విట్టర్ పేజ్‌ ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా, అది ప్రస్తుతం తెగ వైరలవుతోంది. 
 
ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. జిమ్నాస్ట్‌కు సాయం చేసేందుకు క్యాట్ సాయం చేస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోకు ఇప్పటికే మిలియన్ వ్యూస్ రాగా, ఇంకా వైరలవుతోంది.