1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated: సోమవారం, 20 డిశెంబరు 2021 (15:06 IST)

ప్రపంచ జిమ్నాస్టిక్ వేదికపై మెరిసిన అరుణా రెడ్డి

ఈజిప్టు వేదికగా ఈజిప్షియన్ ఫోరోస్ కప్ 2021లో భాగంగా అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ వేదికపై తెలంగాణ ప్రాంతానికి చెందిన అరుణా రెడ్డి అనే అమ్మాయి సత్తా చాటింది. జిమ్నాస్టిక్ పోటీల్లో రాణించి ఏకంగా రెండు బంగారు పతకాలను స్వాధీనం చేసుకుంది. తద్వారా అంతర్జాతీయ వేదికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. 
 
హైదరాబాద్ నగరానికి చెందిన అరుణా రెడ్డి ఇటీవలే మోకాలికి సర్జరీ చేయించుకున్నారు. ఈ సర్జరీ నుంచి కోలుకున్న ఆమె... ఈ టోర్నీలో ఏకంగా రెండు బంగారు పతకాలను గెలుచుకోవడం గమనార్హం. కాగా, గత 2018 ప్రపంచ జిమ్నాస్టిక్ చాంపియన్‌షిప్ పోటీల్లోనూ ఈమె కాంస్య పతకం సాధించిన విషయం తెల్సిందే.