గురువారం, 28 నవంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 19 జూన్ 2024 (11:43 IST)

పావో నుర్మి గేమ్స్‌లో నీరజ్ చోప్రాకు బంగారు పతకం

Neeraj Chopra
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పావో నుర్మి గేమ్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఫిన్‌లాండ్ వేదికగా జరిగుతున్న టోర్నీలో జావెలిన్‌న్ను ఏకంగా 85.97 మీటర్లు విసిరి సత్తా చాటారు. ఎనిమిది మంది అథ్లెట్లు పాల్గొన్న ఈ ఈవెంట్లో తన మూడో ప్రయత్నంలో నీరజ్ 85.97 మీటర్ల త్రోతో గోల్డ్ మెడల్ దక్కించుకున్నారు.
 
ఇక నీరజ్‌కు ఈ సీజన్‌లో ఇది మూడో ఈవెంట్. గాయం బారిన పడకూడదనే ముందు జాగ్రత్త కారణంగా గత నెలలో చెకియాలో జరిగిన ఓస్ట్రావా గోల్డెన్ స్పైక్ అథ్లెటిక్స్ మీటు అతడు దూరమయ్యాడు. కాగా, పారిస్ ఒలింపిక్స్ ముందు నీరజ్ ప్రదర్శన మరోసారి పతకంపై భారత్ ఆశలను పెంచేసింది.
 
కాగా, నీరజ్ 83.62 మీటర్ల త్రోతో ఈవెంట్‌ను ప్రారంభించాడు. మొదటి రౌండ్ ముగిసేసరికి అతనే ముందంజలో ఉన్నాడు. కానీ, రెండో రౌండ్లో ఫిన్లాండ్‌కు చెందిన ఆలివర్ హెలాండర్ తన ఈటెను 83.96 మీటర్లకు విసిరి మనోడిని రెండో స్థానానికి నెట్టాడు. అయితే మూడో ప్రయత్నంలో భారత్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చింది. చోప్రా తన జావెలిన్‌న్ను ఏకంగా 85.97 మీటర్లకు విసిరాడు. మరో ఫిన్‌లాండ్ అథ్లెట్ టోనీ కెరానెన్ 84.19 మీటర్ల త్రోతో చోప్రాకు దగ్గరగా వచ్చాడు.