సోమవారం, 2 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 1 డిశెంబరు 2016 (12:55 IST)

మకావు ఓపెన్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లిన సైనా నెహ్వాల్.. దివాకు చుక్కలు..

మకావు ఓపెన్‌ గ్రాండ్‌ప్రిలో భారత స్టార్‌ షెట్లర్‌ సైనా నెహ్వాల్‌ విజయం సాధించింది. ఇండోనేషియా క్రీడాకారిణి దివా అయుస్తిన్‌పై విజయం సాధించింది. తొలి సెట్‌ను చేజార్చుకున్న సైనా రెండో సెట్‌లో పుంజుకుంది.

మకావు ఓపెన్‌ గ్రాండ్‌ప్రిలో భారత స్టార్‌ షెట్లర్‌ సైనా నెహ్వాల్‌ విజయం సాధించింది. ఇండోనేషియా క్రీడాకారిణి దివా అయుస్తిన్‌పై విజయం సాధించింది. తొలి సెట్‌ను చేజార్చుకున్న సైనా రెండో సెట్‌లో పుంజుకుంది. దీంతో హోరాహోరిగా జరిగిన రెండో సెట్‌ను సైనా 21-18తో గెలుచుకుంది.

నిర్ణయాత్మక మూడో సెట్‌లో సైనాకు ప్రత్యర్థి దివా ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఫలితంగా మూడో సెట్‌ను సునాయాసంగా కైవసం చేసుకున్న సైనా నెహ్వాల్ 17-21, 21-18, 21-12తో విజయం సాధించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది.
 
ఇదిలా ఉంటే.. హాంకాంగ్‌ సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఆశించిన మేర ఆకట్టుకోలేకపోయింది. ఈ టోర్నీ క్వార్టర్ ఫైనల్స్‌లో హాంకాంగ్ చెంగ్ యు చేతిలో 8-21, 18-21, 19-21తో సైనా నెహ్వాల్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే మకావు ఓపెన్‌లో సైనా మెరుగైన ఆటతీరును ప్రదర్శిస్తోంది.