శనివారం, 4 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 జనవరి 2024 (16:42 IST)

వివాహం - విడాకులు కఠినమైనవే.. సానియా మీర్జా

sania mirza - malik
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ అక్తర్ విడాకులు తీసుకోబోతున్నారనే వార్త చాలారోజులుగా నెట్టింట వైరల్ అవుతోంది. పెళ్లికి తర్వాత దుబాయ్‌లో నివసిస్తున్న ఈ జంట.. తమ తమ దేశాల కోసం క్రీడలకు ప్రాతినిథ్యం వహించారు. ప్రస్తుతం షోయబ్ అక్తర్ క్రికెట్‌కు, సానియా మీర్జా టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. 
 
తాజాగా ఆమె చేసిన పోస్ట్ ఆమె షోయబ్ అక్తర్‌కు విడాకులు ఇస్తుందనే వార్తలకు తెరలేపాయి. ఆమె చేసిన పోస్టులో వివాహం కఠినమైంది. విడాకులు కఠినమైనది. అది ఎంత కష్టమైనదో దానిని ఎంపిక చేసుకోండి. శరీర బరువుగా ఉండటం కష్టం. ఫిట్‌గా వుండటం అంతకంటే కష్టం. అది ఎంత కష్టమైనదో దానిని ఎంపిక చేసుకోండి. 
 
అప్పుల్లో వుండటం కష్టం. ఆర్థిక ఇబ్బందుల్లో వుండటం కష్టం. జీవితం ఎప్పుడు సులభంగా వుండదు. ఎప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. కానీ మనం కఠినమైన నిర్ణయాన్ని  ఎంపిక చేసుకోవచ్చు. తెలివిగా ముందుకు సాగవచ్చు" అని తెలిపింది.