మంగళవారం, 7 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 మే 2022 (20:15 IST)

థామస్‌ కప్‌: రికార్డ్ సృష్టించిన భారత్... 43 ఏళ్ల తర్వాత పతకం ఖాయం

Uber cup
Uber cup
థామస్‌ కప్‌లో భారత్‌ చరిత్ర సృష్టించింది. 43 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ సెమీఫైనల్‌ చేరిన భారత్‌ ఈ టోర్నీలో తొలిసారి పతకం ఖాయం చేసుకుంది.
 
పురుషుల విభాగం పురుషుల జట్టు క్వార్టర్‌ఫైనల్లో మలేషియాను ఓడించింది. మరోవైపు ఉబెర్‌ కప్‌లో అమ్మాయిల పోరాటం క్వార్టర్‌ఫైనల్లోనే ముగిసింది.
 
గురువారం హోరాహోరీగా సాగిన పోరులో భారత్‌ 3-2తో మలేషియాను ఓడించింది. ఈ పోరు ఆరంభంలో భారత్‌ది వెనకడుగే. తొలి సింగిల్స్‌లో స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ 21-23, 9-21తో లీ జీ జియా చేతిలో ఓడిపోయాడు. ఈ మ్యాచ్‌లో లక్ష్య పోరాటం తొలి గేమ్‌కే పరిమితమైంది.
 
అయితే డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌శెట్టి 21-19,21-15తో గోఫియ్‌-ఇజుద్దీన్‌పై గెలిచి భారత్‌ను పోటీలో నిలిపారు. దూకుడుగా ఆడిన భారత జంట.. ఐదు మ్యాచ్‌ పాయింట్లు సాధించి ఓ మెరుపు స్మాష్‌తో మ్యాచ్‌ను ముగించింది.