శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 12 ఆగస్టు 2021 (14:12 IST)

అథ్లెట్ కామెరాన్ బురెల్ మృతి..

Cameron Burrell
అగ్రరాజ్యం అమెరికాకు చెందిన అథ్లెట్ కామెరాన్ బురెల్ (26) ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. కామెరాన్ మృతిపై ఆయన తల్లిదండ్రులు.. లెరోయ్ బురెల్, మిచెల్ ఫిన్ బురెల్ స్పందించారు. కామెరాన్ మృతికి సంబంధించి.. స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. 
 
అయితే తమ కొడుకు మృతిపట్ల సంతాపం తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యావాదాలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. కాగా.. కామెరాన్ బురెల్ 2011-18 మధ్య జూనియర్, సీనియర్ కేటగిరిల్లోని పరుగుల పోటీల్లో అనేక గోల్డ్ మెడెల్స్‌ను సాధించాడు. కామెరాన్ తల్లిదండ్రులు కూడా ఒలింపిక్స్‌లో బంగారు పతకాలను సాధించారు.
 
బురెల్ ఒక ఐకానిక్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఫ్యామిలీ నుండి వచ్చాడు. అతని తండ్రి 100 మీటర్లలో మాజీ ప్రపంచ రికార్డు హోల్డర్.. అతని తల్లి, మిచెల్ ఫిన్-బురెల్, 1992 స్పెయిన్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో స్ప్రింట్ రిలే బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. డాన్ బురెల్, ఆస్ట్రేలియాలో 2000 ఒలింపిక్స్‌లో లాంగ్ జంప్‌లో పాల్గొన్నారు. అతని గాడ్ ఫాదర్, కార్ల్ లూయిస్, తొమ్మిది బంగారు పతకాలు గెలుచుకున్నాడు.