సోమవారం, 6 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 మే 2023 (11:21 IST)

నార్కో టెస్టుకు నేను రెడీ.. మహిళా రెజ్లర్లు రెడీనా?: బ్రిజ్ భూషణ్

Brij Bhushan Singh
Brij Bhushan Singh
తాను నార్కో అనాలసిస్ పరీక్షలకు సిద్ధంగా వున్నట్లు జాతీయ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్ సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్.. తనతో పాటు మరో ఇద్దరికీ కూడా నార్కో పరీక్షలు చేయాలని డిమాండ్ చేశారు. 
 
జంతర్‌ మంతర్‌ వద్ద గత కొన్నిరోజులగా మహిళా రెజ్లర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రిజ్‌ భూషణ్‌కు నార్కో పరీక్షలు నిర్వహించాలని ఖాప్‌ పంచాయితీ తీర్మానించింది.  దీనిపై స్పందించిన బ్రిజ్‌ భూషణ్‌..నార్కో, పాలిగ్రాఫ్‌, లై డిటెక్టర్‌ పరీక్షలకు సిద్ధమని తెలిపాడు. 
 
అలాగే తనతోపాటు మహిళా రెజ్లర్లైన వినేశ్‌ ఫొగాట్‌, బజరంగ్ పునియా కూడా ఈ పరీక్షలు చేయించుకోవాలని డిమాండ్ చేశారు. వారు ఈ పరీక్షలకు అంగీకరించినట్లైతే మీడియా ముందు ప్రకటించాలని కోరాడు. వారు సిద్దమైతే.. తాను కూడా సిద్ధమని ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో పేర్కొన్నాడు.