బుధవారం, 18 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 జులై 2021 (18:52 IST)

ఆపిల్స్ జిలేబీ టేస్ట్ చేశారా?

jilebi
ఆపిల్స్ తినడం వల్ల మెదడు వేగంగా పనిచేస్తుంది. ఆపిల్‌లో ఉండే పోషకాలు ప్లెజర్ హార్మోన్స్ స్థాయిని మెయింటైన్ చేస్తాయి. ఇది మనం సంతోషంగా ఉండటానికి మానసిక ఒత్తిడికి గురికాకుండా అనుమతిస్తుంది. ప్రతి రోజూ ఆపిల్స్‌ను సేవించే వారికి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం చాలా తక్కువ. ఆపిల్స్ ను రెగ్యులర్ గా తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ ను సరిగ్గా ఉంచుతుంది, ఇది మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాంటి ఆపిల్‌తో జిలేబీ ట్రై చేస్తే ఎలా వుంటుందో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు.. 
ఆపిల్-1,
పంచదార-300 గ్రాములు, 
కుంకుమ పువ్వు-ఒక గ్రాము, 
నెయ్యి-500 గ్రాములు, 
పాలు- 250 మిల్లీ లీటర్లు, 
పెరుగు- 100 గ్రాములు
మైదా- 200 గ్రాములు.
 
తయారీ విధానం :
ఆపిల్ జిలేబిని తయారు చేయడానికి ముందు పెరుగుని మైదా పిండిలో వేసి నాన బెట్టాలి. ఆ తరువాత 24 గంటల వరకు అలానే వదిలేయాలి. ఇప్పుడు పంచదార తీసుకుని సిరప్ లాగా చేయండి. ఆ తర్వాత దీనిలో పాలు కూడా పోసి అలా ఉంచేయండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దానిలో నెయ్యి వేసి మరిగించండి. దానిలో కట్ చేసిన యాపిల్ ముక్కల్ని పిండిలో ముంచి వేయించండి. వాటిని పక్కన పెట్టి షుగర్ సిరప్‌లో వెయ్యండి. అంతే ఇక యాపిల్ జిలేబి రెడీ అయిపోయింది. సర్వ్ చేసేసుకోవడమే.