సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ ఎన్నికలు 2023
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 5 డిశెంబరు 2023 (11:29 IST)

సీఎం అభ్యర్థిపై వాళ్లిద్దరే మెలిక, ఈరోజు తెల్చేస్తామన్న ఖర్గే, ఉత్తమ్-భట్టి ఢిల్లీకి ఎందుకు?

uttam kumar reddy
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఊహించని రీతిలో దూసుకెళ్లి ప్రభుత్వ ఏర్పాటుకి అవసరమైన మేజిక్ ఫిగర్‌ను సాధించింది. అంతవరకు బాగానే వుంది కానీ ఫలితాలు వెల్లడై 3 రోజులు కావస్తున్నా ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ప్రకటించలేకపోయింది. దీనితో ఎప్పటిలాగే కాంగ్రెస్ పార్టీపై వున్న సీఎం అభ్యర్థుల లొల్లి మరోసారి రుజువైనట్లయింది.
 
revanth reddy couple
ఈ పదవి కోసం రేవంత్ రెడ్డి ఒక్కరే రేసులో వున్నారని చెబుతున్నప్పటికీ భట్టి విక్రమార్క- ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో మెలిక పెడుతున్నట్లు సమాచారం. దీనితో వాళ్లద్దర్నీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఢిల్లీకి పిలిపించారు. ఈరోజు వారితో సమావేశమై పదవులపై వారికి క్లారిటీ ఇచ్చి లైన్ క్లియర్ చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద ముఖ్యమంత్రి అభ్యర్థిపై సస్పెన్స్ మాత్రం అలాగే కొనసాగుతోంది.